EML India

ఏపీ బడ్జెట్ హైలైట్స్…

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on telegram
Telegram
Share on email
Email
Finance_minister-buggena

అమరావతి, మే 20 : 2021–22 రాష్ట్ర బడెట్‌ అంచనా రూ. 2,29,779.27 కోట్లు కాగా.. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా రూ. 2,24,789.18 కోట్లు. 2020–21తో పోలిస్తే వెనకబడిన కులాల బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు ఏపీ బడ్జెట్ .

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. నవరత్నాలతో పాటూ మరికొన్ని పథకాలకు ప్రాథాన్యం ఇచ్చారు. ఈసారి చిన్నారులకు, మహిళలకు కూడా ప్రత్యేక బడ్జెట్‌ పేపర్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021–22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ. 2,29,779.27 కోట్లు కాగా.. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా రూ. 2,24,789.18 కోట్లు. 2020–21తో పోలిస్తే వెనకబడిన కులాల బడ్జెట్‌లో 32 శాతం అధికంగా కేటాయింపులు, బడ్జెట్‌లో రూ. 28,237 కోట్లు ( 2020–21లో రూ.21,317.24 కోట్లు). బడ్జెట్‌కు సంబంధించిన హైలైంట్స్ ఇలా ఉన్నాయి.

 1. ఈబీసీ సంక్షేమంలో 8 శాతం అధిక కేటాయింపులు, బడ్జెట్‌ రూ.5,478కోట్లు (2020–21లో రూ.5,088.55 కోట్లు).
 2. కాపు సంక్షేమంకోసం 7 శాతం అధిక కేటాయింపులు, 3,306 కోట్లు (2020–21లో రూ.3,090 కోట్లు)
 3. బ్రాహ్మణుల సంక్షేమంలో 189 శాతం అధిక కేటాయింపులు, రూ.359 కోట్లు (2020–21లో రూ.124 కోట్లు)
 4. ఎస్సీ సబ్‌ప్లాన్‌లో 22 శాతం అధిక కేటాయింపులు, రూ. 17403 కోట్లు (2020–21లో రూ. 14,218కోట్లు)
 5. ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 27శాతం అధిక కేటాయింపులు, రూ. 6,131కోట్లు (2020–21లో రూ.4,814 కోట్లు).
 6. మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కింద రూ. 3,840.72 కోట్లు దీంతో పాటు మైనార్టీ సబ్‌ప్లాన్‌లో 7శాతం పెరుగుదల, రూ.1756 కోట్లు (2020–21లో రూ. 1634 కోట్లు)
 7. పిల్లలు, చిన్నారులకోసం బడ్జెట్‌లో రూ. 16,748 కోట్లు
 8. మహిళల అభివృద్ధికి రూ. 47,283.21 కోట్లు
 9. వ్యవసాయ పథకాలకు కేటాయింపులు 11,210 కోట్లు
 10. విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
 11. వైద్యం– ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
 12. వైఎస్సార్‌ పెన్షన్‌కానుక రూ. 17,000 కోట్లు
 13. వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 3,845 కోట్లు
 14. జగనన్న విద్యా దీవెనకు రూ.2500 కోట్లు
 15. జగనన్న వసతి దీవెనకు రూ. 2,223.15 కోట్లు
 16. వైయస్సార్‌ – పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ. 1,802 కోట్లు
 17. డ్వాక్రా సంఘాలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద చెల్లింపులకు రూ.865 కోట్లు
 18. పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు పై పథకం కింద రూ. 247 కోట్లు, మొత్తంగా రూ. 1,112 కోట్లు
 19. రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపులు కోసం రూ. 500 కోట్లు
 20. వైఎస్సార్‌ కాపు నేస్తంకోసం రూ. 500 కోట్లు
 21. వివిధ పథకాల కింద కాపు సామాజికవర్గ సంక్షేమంకోసం రూ. 3,306 కోట్లు
 22. వైఎస్సార్‌ జగనన్న చేదోడు పథకంకోసం రూ.300 కోట్లు
 23. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకంకోసం రూ. 285 కోట్లు
 24. వైఎస్సార్‌ నేతన్న నేస్తంకోసం రూ. 190 కోట్లు
 25. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కోసం రూ. 120 కోట్లు
 26. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 50 కోట్లు
 27. అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులకోసం రూ. 200 కోట్లు
 28. రైతులకు ఎక్స్‌గ్రేషి కింద ( దురదృష్టవశాత్తూ ఆత్మహత్యకు పాల్పడితే) రూ.20 కోట్లు
 29. లా నేస్తకోసం రూ. 16.64 కోట్లు
 30. ఈబీసీ నేస్తంకోసం రూ. 500 కోట్లు
 31. వైఎస్సార్‌ ఆసరాకోసం రూ. 6,337 కోట్లు
 32. అమ్మ ఒడి కోసం రూ. 6,107 కోట్లు
 33. వైఎస్సార్‌చేయూత కోసం రూ. 4,455 కోట్లు
 34. రైతుల పథకాలకు రూ. 11,210.80 కోట్లు
 35. వైఎస్సార్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ. 88.57 కోట్లు
 36. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1802.82 కోట్లు
 37. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ. 739.46 కోట్లు
 38. వైఎస్సార్‌ పశువుల నష్టపరిహార పథకానికి రూ. 50 కోట్లు
 39. విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు
 40. దీంట్లో స్కూళ్లలో నాడు–నేడుకు రూ. 3,500 కోట్లు
 41. జగనన్న గోరుముద్దకోసం రూ. 1,200కోట్లు
 42. జగనన్న విద్యాకానుక కోసం రూ. 750 కోట్లు
 43. ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు
 44. ఆరోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు
 45. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94 కోట్లు
 46. ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 1,535 కోట్లు
 47. కోవిడ్‌పై పోరాటానికి రూ. 1000 కోట్లు
 48. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కోసం రూ.100 కోట్లు
 49. పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు
 50. హౌసింగ్‌ కోసం, మౌలిక సదుపాయాకోసం మొత్తంగా రూ. 5,661 కోట్లు
 51. పరిశ్రమలకు ఇన్సెంటివ్‌లకోసం రూ.1000 కోట్లు
 52. వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌మాన్యుఫాక్చరింగ్‌ కోసం రూ. 200 కోట్లు
 53. కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం రూ. 250 కోట్లు
 54. ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు
 55. ఎంఎస్‌ఎంఈల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 60.93 కోట్లు
 56. పారిశ్రామిక మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 3,673.34 కోట్లు
 57. రోడ్లు భవనాల శాఖకు 2021–22 సంవత్సరంలో రూ. 7,594.6 కోట్లు
 58. ఎనర్జీ రంగానికి రూ. 6,637 కోట్లు
 59. వైయస్సార్‌ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
 60. వైయస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ. 243.61 కోట్లు
 61. దిశకు రూ. 33.75 కోట్లు
 62. అంగన్‌వాడీల్లో నాడు – నేడు కార్యక్రమాలకోసం రూ. 278 కోట్లు
 63. వైఎస్సార్‌ బీమాకు రూ. 372.12 కోట్లు
 64. అర్చకులకు ఇన్సింటివ్‌లకు రూ.120 కోట్లు
 65. ఇమామ్స్, మౌజంలకు ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు
 66. పాస్టర్లకు ఇన్సింటివ్‌లకు రూ. 40 కోట్లు
 67. ల్యాండ్‌ రీ సర్వేకోసం రూ. 206.97 కోట్లు
 68. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ. 8,727 కోట్లు. గత ఏడాదితో పోలిస్తే 7.2శాతం అధికం.
 69. 2021–22లో నీటిపారుదల శాఖకు రూ. 13,237.78 కోట్లు
Share on facebook
Share on twitter
Share on linkedin
Share on google
Share on whatsapp
Share on email
Share on pinterest
Share on reddit
Share on telegram
Share on tumblr