EML India

Gandrakota Sreedevi Sudheer Yadav Recent Activities…

02-09-2021

ములుగు జిల్లా
ములుగు పట్టణం.

ఢిల్లీ లో తెరాస కార్యాలయం పూమి పూజ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు KTR గారి ఆదేశానుసరం ఈరోజు ములుగు పట్టణం లో పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్ ఆధ్వర్యంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ గారు జెండా ఆవిష్కరణ చేసారు

వారు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంత మంది అమరులయ్యారు ఎన్నో ఉద్యమాలు చేసాం కెసిఆర్ గారు ఎన్నో రోజులు నిరాహార దీక్షలు రాస్తా రోకోలు ప్రాణం పోయిన పర్లేదు అని ఒక్క నాయకుడు ఆ రోజు ముందు అడుగు వేసాడు కెసిఆర్ గారు బక్క పల్చని వాడు తెలంగాణ సాధించిన ఘనుడు అని అన్నారు

ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య md సలీమ్ చెన్న విజయ్ కుమార్ ఖాసీం రాజు తరుణ్ రెడ్డి వేణు తెరాస కార్యకర్తలు తదితరు పాల్గొన్నారు

01-09-20

ములుగు జిల్లా.
బండారుపల్లి.ఈ రోజు బండారుపల్లి ప్రభుత్వ ZPSS  మరియు మోడల్ స్కూల్ ప్రారంభం ఐనా సందర్బంగా ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుదీర్ గారు పర్యవేక్షణ లో భాగంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో కోవిడ్ నియమ నిబంధన లు పాటిస్తూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ లు దారిస్తూ ప్రతి రోజు శనిటైజెషన్ చేయాలి దగిన జాగ్రత్తలు తీసుకోవాలి కరోనా భారిన పడకుండా చూసుకోవాలనిమరియు విద్యార్థులకు మెరుగైన విద్య భోదించాలని దగిన వసతులు కల్పించాలని అని అన్నారు అలాగే అంగన్వాడీ సెంటర్ లో మధ్యాహ్నం భోజనం పథకం ఎలా అమలు అవుతుందో అడిగి మరి తెల్సుకున్నారు ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకరావాలి మా వంతు సహాయ సహకారలు అందచేస్తాం అని అన్నారు

ఈ కార్యక్రమం లో ములుగు పట్టణ అధ్యక్షు లు మెరుగు సంతోష్, MEO శ్రీనివాస్, MPO హన్మంత్, EO మహేందర్, పాఠశాల ప్రిన్సిపాల్, మరియు ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు

21-08-2021 – ఈ రోజు *T NEWS బ్యూరో ప్రదీప్* గారి తండ్రి గారు కొద్దిరోజులక్రింద పరమవదించినందున వారిని వారి కుటుంబ సభ్యులను నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెలమకన్నె గ్రామానికి పరామర్శించడానికి వెళ్లిన *ములుగు జిల్లా TRS నాయకులు శ్రీ గండ్రకోట సుధీర్ గారు*

05-08-2021 – వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి మా అభిమాన నాయకులు శ్రీ గౌరవనీయులు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్న గారి జన్మదినం సందర్భంగా అన్న గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ములుగు ఎంపీపీ గండ్రకోట సుధీర్- శ్రీదేవి గారు…

28-07-2021 –

ఆహార భద్రత కార్డ్ కుటుంబానికి ఆసరా…

ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ యడవు అధ్యక్షతన స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ స్వామితో కలిసి ఆహార భద్రత కార్డులు పంపిణీ చేశారు.

కార్యక్రమన్ని ఉద్దేశించి ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ యాదవ్ మాట్లాడుతూ…
రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది.
దరఖాస్తులు ఆగస్టు నెల మొదటి నుండి అర్హులైన వారికి గతంలో చేయని వారు చేసుకొనవచ్చు అన్నారు.
ప్రతి ప్రభుత్వ సంక్షేమం పథకాలు పేదలకు అందలి అంటే అర్హులైన పేదలకు రేషన్ కార్డ్ తప్పకుండా ఉండాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదల కడుపునిండా అన్నం పెట్టాలి అనే ఉద్దేశ్యంతో ఒక్క రూపాయికి బియ్యం పంపిణీ చేస్తున్నారు అని ఈ యొక్క సందర్భంగా ఎంపీపీ సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈయొక్క కార్యక్రమంలో ఎంపీటీసీలు పోరిక విజయ్ రామ్ నాయక్,గొర్రె సమ్మయ్య,శ్రీను,సత్యనారాయణ, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

25-07-2021 –

సన్మానం..
ములుగు జిల్లా పాలంపేట గ్రామానికి చెందిన రామప్ప ఆలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో(యూనిస్కో) గుర్తింపు దక్కడనికి అహర్నిశలు కృషి చేసిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని ములుగు ఎంపీపీ శ్రీ గండ్ర కోట శ్రీదేవి సుదీర్ యాదవ్ శాలవు తో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుదీర్ మాట్లాడుతూ..

800 ఏండ్ల కాకతీయుల నాటి గొప్ప కట్టడం రామప్ప దేవాలయం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయులు ములుగు ప్రాంతంలో నిర్మిచడం ఇప్పుడు ప్రపంచంలో గుర్తింపు పొందడం శుభ పరిమాణం.
ఇది తెలంగాణ ప్రజల విజయం.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి,ఐటీ మంత్రులు కేటీఆర్ గారికి,ఇంచార్జి మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారికి,మంత్రులు దయాకరరావు గారికి
ఎంపీ మలోత్ కవిత గారికి,ములుగు నియోజకవర్గ పార్టీ ఇంచార్జి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ గారికి
ములుగు ప్రాంత ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం గులాబీ శ్రేణులతో కలిసి హరితహారం బాగంగా మొక్కలను నాటారు.
వీరి వెంట సీనియర్ నాయకులు
పోరిక గోవింద్ నాయక్,
మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్
ఎంపీటీసీ పోరిక విజయ్ రాం నాయక్,గొర్రె సమ్మయ్య,సత్యనారాయణ, యువజన నాయకులు చేన్న విజయ్
ప్రశాంత్,హరీష్,తదితరులు ఉన్నారు

24-07-2021 – గౌరవనీయులు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ములుగు mpp gandrakota సుధీర్ -శ్రీదేవి గారు

24-07-2021 – Gandrakota Sreedevi Sudheer Wishing KTR  Garu a Very happy Birthday.

21-07-2021 – ఈ రోజు డి ఎం హెచ్ ఓ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ములుగు ఎంపీపీ గండ్రకోట సుదీర్ -శ్రీదేవి గారు పాల్గొని కరోనా 3rd వేవ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు , మరియు ప్రజలందరికీ అవగాహన కల్పించడం వంటి విషయాలపై చర్చించడం జరిగింది ,ఈ కార్యక్రమంలో డీఎంహెచ్  డాక్టర్ అప్పయ్య ,డాక్టర్ జోష్ణ , సూపర్వైజర్ భూపాల్ రెడ్డి మరియు వైద్యాధికారులు,  మెడికల్ సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు.

21-07-2021 – అల్లా మీ కుటుంబాలలో వెలుగులు నింపాలని ప్రార్థిస్తూ.. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ.. ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు.మీ ఎంపీపీ gandrakota సుధీర్- శ్రీదేవి

09-07-2021 – 

ఈ రోజు అబ్బాపూర్ గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమం లను ప్రారంభించిన ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ గారు మాట్లాడుతూ
అబ్బాపూర్ గ్రామం లో ఈ రోజు కొబ్బరికాయ కొట్టు ప్రారంభం చేయడం జరిగింది. అబ్బాపూర్ గ్రామం లో మిషన్ భగీరథ పనులు పూర్తి ఐనా కాంట్రాక్టర్ మరియు సిబ్బంది నిర్లక్ష్యం వాళ్ళ ఇప్పటి వరకు నీటి చుక్క రానందున మిషన్ భగీరథ AE నర్సయ్య DE సంధ్యరాణి RWSAE లత గారితో సమస్య పై మాట్లాడి అతి త్వరలో నీళ్ల వచ్చేలా చూడాలని సూచించారు.
జకారం గ్రామం లో సీజనల్ వ్యాధులు రాకుండా అవగాహనా కోసం వర్షం నీరు నిల్వ అయ్యే వాడుకునే నీటి తొట్టి లో నిరుని ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుదీర్ దగ్గర ఉండి మరి నీటిని పరపోయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ దాసరి రమేష్ అబ్బాపూర్ సర్పంచ్ గండి కల్పన కుమార్ mpdo శ్రీనివాస్ RWSAE లత APO గారు అబ్బాపూర్, జకారం సెక్రటరీలు గ్రామశాఖ అద్యక్షలు బ్రమ్మచారి TRS నాయకులు కుమార్ తరుణ్ రెడ్డి స్కూల్ చేర్మెన్ కుమార్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

08-07-2021 – 

ఈ రోజు కోడిశాలకుంట, మంసింగ్ తండా, గుర్తుర్ తండా. మొద్దునూర్ తండా. గ్రామపంచాయతీలలో పర్యటించి ములుగు ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి సుదీర్ గారు వారు మాట్లాడుతూ

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన తండాలు మనమే అభివృద్ధి చేసుకునేల మన ముఖ్య మంత్రి కెసిఆర్ గారు అవకాశం ఇచ్చారు 7వ విడుతా హరితహారం లాంటి కార్యక్రమలను ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇచ్చి నటించి విజయవంతం చేయాలి అన్నారు గ్రామం లో డ్రైనేజి తదితర సమస్యలు ఉంటే పల్లె ప్రగతి కార్యక్రమం లో మీరే దగ్గర ఉండి చేసుకోవాలి మనలాంటి చిన్న చిన్న గ్రామపంచాయతీ లను మనమే దగ్గర ఉండి అభివృద్ధి వైపు నడిపిచాలి
ప్రతి ఒక్కరు బాధ్యతగా చూసుకొని స్వచంగా పనిచేయాలని సూచించారు

నూతనంగా ఎర్పడిన గ్రామపంచాయతీలకు గ్రామపంచాయతీ భావనల విషయం లో అతి త్వరలో జిల్లా కలెక్టర్ మరియు మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లి మంజురూ అయ్యే విధంగా సహకారం చేస్తానని ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి సుదీర్ అన్నారు


ఈ కార్యక్రమం లో MPDO శ్రీనివాస్, మొద్దునూర్ తండా సర్పంచ్ తిరుపతి కోడిషాలకుంట ఎంపీటీసీ లాలు కోడిషాలకుంట సర్పంచ్ యాకుబ్, తరుణ్ రెడ్డి TRS పార్టీ నాయకులు గ్రామపార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్….

07-07-2021 –

ములుగు జిల్లా జడ్పీచెర్మన్ కుసుమ జగదీశ్ గారితో ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ గారు హరితహారం లో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ

గ్రీన్ తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి KCR గారు హరితహారం కార్యక్రమం మొదలుపెట్టనా సందర్బంగా ఈ రోజు 7వ విడుత హరితహారం లో భాగంగా ములుగు సివిల్ హాస్పిటల్ మరియు జకారం పరిధిలో ములుగు జిల్లా జడ్పీచెర్మన్ కుసుమ జగదీష్ గారి తో ములుగు ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి సుదీర్ గారు పాల్గొన్నారు అభివృద్ధి తెలంగాణ కోసం ముఖ్య మంత్రి గారు అన్నో అద్భుతంమైన పధకాలు చేపడుతున్నారు అందులో భాగంగా హరితహారం హరితహారం లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి అని పిలుపునిచ్చారు ఇంటి ఇంటికి మొక్కల పంపిణి అందరూ విధిగా నాటలని అన్నారు తెలంగాణ లో అటవీశాతం పెరిగింది పెంచెందుకు ప్రయత్నం చేద్దాం అన్నారు

ఈ కార్యక్రమం లో జకారం సర్పంచ్ దాసరి రమేష్ mro సత్యనారాయణ mpdo శ్రీనివాస్ mpo హన్మంతరావు eo శంకర్ ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య సీనియర్ నాయకులు గోవింద్ నాయక్ పట్టణ అధ్యక్షులు సంతోష్ కోప్షన్ మెంబెర్ md యూనాస్ trs నాయకులు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

06-07-2021 – 

పల్లెప్రగతి కార్యక్రమం లో పాల్గొని ప్రజల సమస్యల పై సంబంధిత అధికారుల తో ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ వారు మాట్లాడుతూ

తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి KCR గారు ప్రతిష్టత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం అందరo మన ఇల్లు ఎలాగైతో శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరు మన వాడ కూడా అలానే శుభ్రంగా ఉంచుకోవాలి ఈ రోజు ఇంచర్ల గ్రామం లో వాడ వాడ తిరిగి డ్రానేజీ సమస్యలు వాలిన కరెంట్ తీగలు వంగి ఉన్న కరెంట్ స్తంబాలు గ్రామం లో రోడ్లు పరిశీలించారు గ్రామస్తులను వారు సమస్యలు అడిగి మరి తెల్సుకున్నారు సంబంధిత అధికారులతో మాట్లాడి చేపిస్తాను అని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ పూజారి రమాదేవి శ్రీనివాస్ సర్పంచ్ మోరే రాజయ్య pacs చేర్మెన్ చిక్కుల రాములు ఉప సర్పంచ్ కుమార్ MDO శ్రీనివాస్ MPO హన్మంత సేట్రెటరీ రాజు TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.

05-07-2021 – 

ఈ రోజు ములుగు ప్రభుత్వ పాఠశాల లో పల్లెప్రగతి లో భాగంగా శ్రమధనం లో పాల్గొన్నా ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ గారు వారు మాట్లాడుతూ

ప్రతి ఒక్కరు శ్రమధనం లో పాల్గొని మీ మీ పరిసరాలలో పిచ్చి మొక్కలు మరియు మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాలి ప్రతి పల్లెలో ప్రగతి కనబర్చాలి అన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ లు వార్డ్ సభ్యులు జిపి సిబ్బంది మరియు అధికారులు పల్లె ప్రగతి కార్యక్రమం సక్రమంగా వినియోగించుకోవాలి ప్రజలు సమస్యలు ఉంటే పల్లె ప్రగతి కార్యక్రమం లో చేసుకునేల చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య MRO సత్యనారాయణ ఎంపీడీఓ శ్రీనివాస్ ములుగు సర్పంచ్ పాఠశాల ఉపాధ్యాయులు జీపీ సిబ్బంది కోప్షన్ మెంబెర్ MD యునస్ తరుణ్ రెడ్డి TRS కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

04-07-2021 – 

పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా ఈరోజు కసిందేవిపేట గ్రామం లో ములుగు ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి సుదీర్ యాదవ్ గ్రామపార్టీ అధ్యక్షులు అమర్సింగ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ లో పలు సమస్యలు పల్లె ప్రకృతి వానలు,హరితహారం మొక్కలు , ఇంటి ఇంటికి మొక్కల పంపిని మరియు గ్రామం లో తిరిగి విధ్యుత్ సరఫరా రైతులకు మరియు గ్రామం లో విధి లైట్లు మరియు డ్రానేజి, రోడ్డులు, గ్రామస్తులతో పలు సమస్యలు అడిగి తెలుసుకొని ఈరోజు విద్యుత్ సప్లై డే కావున భూపాలపల్లి, ములుగు జిల్లాల SE మధుసూదన్ గారితో విద్యుత్ సమస్యల విషయం లో వారితో చేర్చించారు మరియు పల్లెప్రకృతి వానలు క్రిమిటోరుయా రైతువేదికలు డంపింగ్ యార్డ్లు పరిశీలించారు పల్లెప్రకృతివనం లో గ్రామపంచాయతీ సిబ్బంది యొక్క బాధ్యతలను వారి మొక్కల పెంపకం అద్భుతం గా ఉన్నాయని వారి యెక్క సేవలను గుర్తుంచారు కరోనా మహమ్మారిని తరిమి కొట్టడం లో గ్రామ ప్రజలను కాపాడుటలో సిబ్బంది పాత్ర చాలా ప్రముఖంగా ఉందన్నారు వారి సేవలను గుర్తించి వారితో మొక్కలను నటించడం జరిగింది వారితో పాటు ఎంపీపీ గడ్రకోట శ్రీదేవిసుదీర్ పల్లెప్రకృతి వనం లో మొక్కలు నాటారు గ్రామపంచాయతీకి నా సేవలు తప్పకుండ ఉంటాయని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమం లో
గ్రామ సర్పంచ్ ఐమద్ పాషా SE npdcl మధుసూదన్ గారు లక్ష్మియ్య మోహన్ రావు నర్సయ్య .వీరాస్వామి . సాలెండర్ రావు .ఎంపీడీఓ శ్రీనివాస్ గ్రామ TRS కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

03-07-2021 – Todays paper clippings of Gandrakota sreedevi sudheer…

03-07-2021 – 

నూతన వదువరులకు ఆశీర్వాదం..

ఈరోజు ములుగు కు చెందిన ఓజ్జల లింగన్న కూతురి రిసెప్షన్ రేగొండ మండలం దుంపిల్లాపల్లిలో ములుగు జిల్లా సీనియర్ నాయకులు గడ్రకోట సుదీర్ యాదవ్
హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు.
నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ముందుకు సాగాలి అని మనసారా దీవించి ఆశీర్వదించారు.

03-07-2021 – 

పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో భాగంగా ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుదీర్ గారు మహ్మద్ గౌస్ పల్లి లో తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు వివరిస్తూ పూర్తిగా వాడ వాడ ఇల్లు ఇల్లు తిరిగి గ్రామస్తులు చెప్పిన సమస్యల విషయం లో స్థానిక అధికారల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పలు సమస్య ల విషయం లో MPDO, MPO అధికారులను పిలుపించి మరి సమస్యలను రాసుకొని మరి వీలైనంత త్వరగా వంగి ఉన్న కరెంట్ స్టాంబాలు కిందికి ఉన్న కరెంట్ తీగలు డ్రానేజీ మరియు త్రాగు నీరు బావి మరమ్మత్తులు చేయాలనీ మళ్ళీ వచ్చే వరకు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉండకుండా చూసుకోవాలని అదేశించారు

ఈ కార్యక్రమం లో స్థానిక ఎంపీటీసీ శ్రీనివాస్ వార్డ్ సభ్యులు రాజు, కార్తీక్ కృష్ణరెడ్డి యువరాజ్ రవి అశోక్ తరుణ్ రెడ్డి స్థానిక అధికారులు పాల్గొన్నారు.

02-07-2021 – 

పల్లె ప్రగతి లో పాల్గొని పల్లెలను శుభ్రం చేస్తున్న మన ప్రియతమ నాయకురాలు గౌరవ ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ గారు.

ఈ రోజు ములుగు జిల్లా లోని జగ్గనాపెట మరియు మదన పల్లి గ్రామం లో పల్లె ప్రగతి రెండవ రోజు లో పాల్గొన్న గౌరవ ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ లకు పట్టు కొమ్మలు పల్లెలు అని గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత అందరిపైనా ఉంది అని గుర్తు చేశారు. పల్లెలు ప్రగతికి మెట్టు అని భావించిన తెరాస ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం నీ తీసుకురావడం హర్షించదగ్గ విషయం అని తెలిపారు.తను కూడా పల్లె ప్రగతి లో పాల్గొనడం సంతోషం గా ఉందని తెలిపారు. అందరు మొక్కలను నాటిన తర్వాత వాటి యొక్క బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పొరిక విజయ్ రాం గారు,గట్టు మహేందర్ గారు,గ్రామ కమిటీ అధ్యక్షులు సారయ్య గారు,రఘువరన్ గారు మరియు ఆశ వర్కర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

01-07-2021 – 

సియం రిలీఫ్ ఫాండ్ పథకం ఒక అద్భుతం ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్

ఎంపీపీ శ్రీదేవిసుదీర్ గారు మాట్లాడుతు అనారోగ్యం పాలయినా నిరుపేదలు ఒకప్పుడు హాస్పిటల్ బిల్లులు చెల్లించలేక ఆస్తులను అమ్ముకున్న రోజులు ఉన్నాయి అదే మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ప్రవేశ పెట్టిన cmrf పథకం నిరుపేదలకు ఆసరాగా నిలుస్తుంది అన్నారు

ఈ రోజు చింతలపల్లికి చెందిన శాంతమ్మకు cmrf పథకం కింద మంజూరు ఐనా 17,000 రూపాయల చెక్కను ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ యాదవ్ గారు అందచేశారు
ఈ కార్యక్రమం లో పత్తిపెల్లి ఎంపీటీసీ నునవత్ మహేష్ EX mpp మురళి తదితరులు పాల్గొన్నారు

01-07-2021 – ఈ రోజు ప్రారంభమైన నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా లో పచ్చదనం, పారిశుద్ధ్యం,ఇతర మౌలిక సదుపాయాలు ఆరోగ్యం,విద్యుత్,డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని పలు సమస్యలను తెలియజేయడం జరిగింది,ఈ సమస్యలు విన్న ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ గారు , ఇంటింటికి వాడ వాడ తిరుగుతూ ప్రజల చెప్పిన సమస్యలను చూడడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో,ఎంపీటీసీ సమ్మయ్య, కో ఆప్షన్ నెంబర్y యూనిస్,పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, మరియు స్థానిక వార్డు మెంబర్లు, మరియు ప్రజాప్రతినిధులు,స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

30-06-2021 – 

పల్లె ప్రగతి 4వ విడత విజయవంతం చెయ్యాలి:ఎంపీపీ

ఈరోజు మండల ప్రజా పరిషత్తు ములుగు కార్యాలయంలో ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్
అధ్యక్షతన జిల్లా ఆర్డీవో రమదేవి,ఎంపీడీఓ శ్రీనివాస్,తహశీల్దార్ సత్యనారాయణ తో కలిసి పల్లె ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈయొక్క కార్యక్రమంలో పల్లె ప్రగతిలో భాగంగా
చేయవలసిన పనులు,ప్రణాలికను చర్చించారు.
అధికారులు, ప్రజలు,ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో విజయవంతం చేయాలి అని తెలిపారు.

30-06-2021 – 

కరోన నిబంధనలు పాటిస్తూ పల్లె ప్రగతి విజయవంతం చెయ్యాలి:జిల్లా అడిషనల్ కలెక్టర్,ములుగు ఎంపీపీ

ఈరోజు ములుగు గ్రామపంచాయతీ కార్యాలయంలో
ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభి,ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ సంయుక్తంగా పల్లె ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈయొక్క కార్యక్రమంలో పల్లె ప్రగతిలో భాగంగా మస్కులు, కరోన నిబంధనలు పాటిస్తూ 4వ విడత పల్లే ప్రగతిని విజయవంతం చెయ్యాలి అని గ్రామపంచాయతీ అధికారులకు,పాలక వర్గనికి,సిబ్బందికి సూచనలు చేశారు.

అధికారులు, ప్రజలు,ప్రజాప్రతినిధులు అందరి సమన్వయంతో విజయవంతం చేయాలి అని తెలిపారు.

28-06-2021 – 

చిన్ననాటి స్నేహితుడు పెళ్లి వేడుకలకు హాజరు…

ములుగు 28 జాన్ 2021:
ములుగు జిల్లా కేంద్రంలో దూడబోయిన సాగర్ పెళ్లి శుభకార్యానికి ములుగు జిల్లా సీనియర్ నాయకులు
గండ్రకోట సుదీర్ యాదవ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
చిన్నటి స్నేహితుడి వివాహ వేడుకల్లో తోటి మిత్రులతో పాల్గొనడం సంతోషం ఉంది అని అన్నారు.
నూతన దంపతులకు దేవుడు దయతో ముందుకు సాగాలి అని కోరుకున్నారు.
వీరితో మండల కో ఆప్షన్ యూనిస్,ఆత్మ డైరెక్టర్ కవ్వంపల్లి బాబు,నగేష్,కుమార్,ఓం ప్రకాష్ మిత్రులు ఉన్నారు.

27-06-2021 – ఈరోజు ములుగు మండలంలోని మల్లంపల్లి చెందిన యూత్ లీడర్ మొర్రి రాజు యాదవ్ తమ్ముడు హరీష్ యాదవ్ కి పెళ్లి ములుగు జిల్లా సీనియర్ నాయకులు గండ్రకోట సుదీర్ యాదవ్ హాజరై నూతన వదువరులను ఆశీర్వదించారు. 

25-06-2021 – Todays Paper clippings of Gandrakota Sreedevi sudheer….

24-06-2021 – 

పెండ్యాల అంబెడ్కర్ కు ఐదు వేలు…
చిలివేరు సారమ్మ కు ఐదు వేలు ఆర్థిక సహాయం..
మానవత్వం చాటుకున్న గండ్రకోట…

ములుగు 24 గురువారం 2021;
ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో గత కొద్ది రోజుల క్రితం సఫాయివాడకు చెందిన పెండ్యాల అంబెడ్కర్ ఆకస్మికంగా మృతి చెందగా వారి కుటుంబాన్ని
ములుగు పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్ ఆధ్వర్యంలో కుటుంబాన్ని ములుగు జిల్లా సీనియర్ నాయకులు గండ్రకోట సుదీర్ యాదవ్ పరామర్శించారు.
స్వయంగా వారి ఇంటికి వెళ్లి చూస్తే వారికి ఇల్లు లేదు.
కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒకే ఒక్క అంబెడ్కర్ చనిపోయాడు.
వారి ఇద్దరి పిల్లల్ని చూసి గండ్రకోట సుదీర్ యాదవ్ చలించిపోయారు. కాన్నిటిపర్యంతం అయ్యారు.
వెంటనే ఆర్థిక సహాయం క్రింద 5000 వేల రూపాయలు అందజేశారు.
అంబెడ్కర్ పిల్లల చదువుల బాధ్యత చూసుకుంటాను అని వారి హామీ ఇచ్చారు.

ములుగు మండలం జగన్నపేట చిన్న గుంటూరు పల్లి గ్రామానికి చెందిన చీలి వేరు సారమ్మ మృతి చెందింది అని సమాచారం తెలుసుకున్న గండ్రకోట సుదీర్ యాదవ్ దశ దిన ఖర్మకు ఖర్చుల గాను
5000 వేల రూపాయలు అందజేశారు.
ఒంటరి వృద్ధురాలు అని తెలుసుకొని ఎవరు లేరు అని సహాయం చేశాను అని తెలిపారు.
పేద ఒంటరి మహిళల కుటుంబానికి అండగా ఉన్న గండ్రకోట శ్రీదేవి సుధీర్….

24-06-2021 – 

ఊరు -వాడ బాగుండాలి…

ములుగు 23 జూన్ 2021:
ములుగు పట్టణంలో వర్షాకాలంలో చుక్క నీరు కూడా ఆగకుండా చర్యలు చేపట్టాలి అని ములుగు జిల్లా తెరాస పార్టీ నాయకులు గండ్రకోట సుదీర్ యాదవ్ అన్నారు.
ఈరోజు ఏఈ లత,గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకర్ తో కలిసి ములుగు పట్టణంలో వాడ వాడ తిరిగారు.
ఈ కార్యక్రమంలో గండ్రకోట సుదీర్ యాదవ్ మాట్లాడుతూ..
వర్షాకాలంలో ప్రజల ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అని డ్రైనేజీ నిండా మురికి నీళ్లు ఆగకుండా చర్యలు చేపట్టాలి అని ఉన్నతాధికారులు దృష్టికి సమస్యలను తీసుకొని వెళ్లడం జరిగింది.
శివాలయం వాడ,గొల్ల వాడ, ప్రగతి కాలనీ,శ్రీనివాస్ కాలనీ చుక్క నీరు కూడా ఆగకుండా డ్రైనేజీలను పరిశీలించారు.
రామాలయం ఏరియాలో కరెంటు స్తంభాలు వెయ్యాలి.ఎక్కడ కుడా విధి దీపాలు లేవో అక్కడ వెంటనే వేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం సమస్యలను జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ దృష్టికి తీసుకొని వెళ్లి నిధులు మంజూరు అయ్యే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను అని అధికారులు సమస్యలను గుర్తించి వెంటనే నా దృష్టికి తీసుకొని రావాలి అని కోరారు.

16-06-2021 – 

నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీపీ…

ఈరోజు ములుగు పట్టణ కేంద్రంలో సుభాష్ నగర్ చెందిన బొడా రఘు రమ దంపతుల కూతురు మౌనిక రాజశేఖర్ లా వివాహానికి హాజరై నూతన దంపతులను ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ ఆశీర్వదించారు.

కలకాలం అనోన్యముగా కలిసి జీవిస్తూ దంపతులు దేవుడు దయతో ముందుకు వెళ్ళాలి అని ఆశీర్వదించారు.

ఈయొక్క కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మెరుగు సంతోష్,
తదితరులు ఉన్నారు.

16-06-2021 – 

కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…

ములుగు:జూన్ 16 మంగళవారం:
ఈరోజు ములుగు మండల పరిషత్తు అభివృద్ధి
(ఎంపీడీఓ)కార్యాలయంలో ములుగు మండల పరిషత్తు అధ్యక్షులు(ఎంపీపీ)గండ్రకోట శ్రీదేవి సుదీర్ అధ్యక్షతన ములుగు మండల వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 30 శాతం వేతనాలు పెంచుతూ నిర్ణయం చేసిన శుభ సందర్భంగా వారి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ మాట్లాడుతూ…
గత ప్రభుత్వాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేశాయి అని ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పాటు
జరిగిన తరువాత గౌరవ వేతనాలు ఇచ్చి గౌరవించడం హర్షణీయం అన్నారు.
ఎంపీటీసీ లకు,జడ్పీటీసీ లకు,సర్పంచ్ లకు గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.
మాలి విడతగా ఉద్యోగులకు వేతనాలు పెంచేస్తూ స్థానిక ఎన్నికల ప్రజాప్రతినిధులను దృష్టిలో పెట్టుకొని మరో మారు 30 శాతం వేతనాలు పెంచడం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేశాం అని అన్నారు.
స్థానిక ఎన్నికల ప్రజాప్రతినిధుల వేతనాలు పెంచిన
కేసీఆర్ గారికి కృతజ్ఞతలు,సమస్యను పరిష్కరించాడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవా

11-05-2021 –

చెక్కు అందజేత…

ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీశ్వర్
అదేశాల మేరకు

ఈరోజు ములుగు మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన వడ్లురీ శంకర్ కొంత కాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబానికి అండగా ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల చెక్కును వారి భార్య వడ్లురీ స్వరూప,కుమారులకు మండల పరిషత్తు అధ్యక్షులు(ఎంపీపీ)గండ్రకోట శ్రీదేవి సుదీర్ యాదవ్,జిల్లా సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ అందజేశారు.
ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుదీర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను ఎల్లవేళలా కంటికి రెప్పలా కపడుకుంటాం అని అన్నారు.
ఈయొక్క కార్యక్రమంలో సర్పంచ్ చందా కుమార్ స్వామి,ఎంపీటీసీ మాచర్ల ప్రభాకర్,గ్రామ పార్టీ ముక్యులు సి హెయ్చు శ్రీనివాస్ రెడ్డి,చిట్టి రెడ్డి మల్ల రెడ్డి,దాసరి సురేష్,తరుణ్ రెడ్డి,మాచర్ల రవి,గొర్రె కుమార్,తదితరులు హాజరయ్యారు.

ప్రయివేటు టీచర్లకు బియ్యం పంపిణీ చేసిన ఎంపీపీ…

ఈరోజు తేదీ: 23-04-2021 శుక్రవారం రోజున ములుగు మండల కేంద్రంలో ప్రయివేటు టీచర్లు కు
ములుగు మండల ప్రజా పరిషత్తు అధ్యక్షులు(ఎంపీపీ) గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్
ఒక్కొక్కరికి 25కేజీ ల చొప్పున బియ్యం పంపిణీ చేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కరోన సమయంలో గత కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రయివేటు టీచర్లు కు 25 కేజీ ల బియ్యం,రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంపీపీ కృతజ్ఞతలు తెలిపారు.కరోన సమయంలో కూడా అధికారులు సమన్వయంతో ఈయొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు అని అన్నారు.ఈయొక్క కార్యక్రమంలో ఎంపీడీఓ రవి,
ఎంఇఓ శ్రీనివాస్,ఎంపీటీసీలు పుష్ప సత్యనారాయణ,డీలర్ మున్న,పట్టణ అధ్యక్షుడు మెరుగు సంతోష్,జిల్లా యువజన నాయకులు
చెన్న విజయ్ కుమార్,హరీష్,అరవింద్ స్కూల్ టీచర్లు వక్కల సతీష్,సాధన స్కూల్ టీచర్లు సురేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ మనకు రక్షణ:ములుగు జిల్లా తెరాస నాయకులు గండ్రకోట సుధీర్.

ఈరోజు తేదీ:20-04-21 బుధవారం రోజున ములుగు జిల్లా ఆస్పత్రిలో వ్యాక్సిన్ సెంటర్లో ములుగు జిల్లా తెరాస పార్టీ నాయకులు గండ్రకోట సుధీర్ వ్యాక్సిన్ వేసుకున్నారు.
ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ మే 1 నుండి 18 సం.ల లోపు ఉన్న అందరు కూడా వైద్యుల పర్యవేక్షణ లో వేసుకోవాలి అని అన్నారు.
ప్రతి ఒక్కరు కరోన టెస్టులు చేసుకోవాలి అని తెలిపారు. ఎవరు కూడా అపోహలకు వెళ్లొద్దు.
వ్యాక్సిన్ వేసుకోవడం వలన జ్వరం,అలసట వస్తే మన బాడీలో పని చేస్తుంది అని అర్థం కాని లేని పోనీ ఆలోచనలు బయలకు పోవద్దు అని అన్నారు.ఆరోగ్య తెలంగాణ లో అందరూ బాగ్యాస్వాములు కావాలి అని గండ్రకోట పిలునిచ్చారు.

మాజీ మంత్రి అజ్మీరా చందూ లాల్ గారు హైదరాబాద్ లో అనారోగ్యంతో తుది శ్వాశ విడిచారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను…ఓం శాంతి….గండ్రకోట శ్రీదేవి సుధీర్

Dr. B . అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్న గండ్రకోట శ్రీదేవి సుధీర్.

గండ్రకోట శ్రీదేవి సుధీర్ గారు తరుపున శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

జీవితంలోని ప్రతి సందర్భంలోనూ మిషన్ భగీరథ మీ గండ్రకోట శ్రీదేవి సుధీర్.

మహాత్మా జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా ఘన నివాళి చేసిన గండ్రకోట శ్రీదేవి సుధీర్ మరియు తెలంగాణ రాష్ట్రానికి మరో టెక్స్టైల్ పరిశ్రమ .

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎలక్షన్స్ లో TRS అభ్యర్థుల కోసం ప్రచారం.

పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదానం చేస్తున్న సుధీర్ గండ్రకోట గారు 

గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్న సుధీర్ గారు .

రైతులకి రైతుబందు కలిపించిన ముఖ్యమంత్రి KCR గారికి పాలాభిషేకం చేస్తున్న సుధీర్ గారు  

రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న సుధీర్ గారు 

కరోనా సమయంలో పేదలకి నిత్యావసర సరుకులు అందిస్తున్న గండ్రకోట సుధీర్ గారు.

గ్రామంలోని సమస్యలను ఆర్ధిక మంత్రి హరీష్ రావు కు  తెలియచేసిన సుధీర్ గారు 

గ్రామంలోని సమస్యలని ఇంటింటికి తిరిగి తెలుసుకుంటున్న సుధీర్ గారు.

ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రైతులకి పొలాలకు సాగునీరు తీసుకురావడం కోసం అడవులని పరిశీలిస్తున్న గండ్రకోట సుధీర్ 

KTR గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన గండ్రకోట సుధీర్ గారు.

పార్లమెంట్ సభ్యుడు డా. బండా ప్రకాష్ ముదిరాజు గారిని మర్యాద పూర్వకంగా  కలవడం జరిగింది.

వ్యవసాయ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం 

KCR పుట్టిన రోజు సందర్భంగా ములుగు జిల్లా నాయకులతో కేక్ కటింగ్.