EML India

Gundlapalli Sreeram Chinnababu Recent Activities…

01-10-2021

  1. YCP MLA సామినేని ఉద‌య‌భానుకి విసిరిన చాలెంజ్ మేర‌కు హైదరాబాద్ లో డ్ర‌గ్స్‌ టెస్ట్‌కి హాజ‌రైన‌ టిడిపి యువ‌నేత‌లు. 
  2. హైదరాబాద్ లో ABN ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
  3. హైదరాబాద్ NTR భవన్ లో విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు 

 

30-09-2021  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషా గారితో తెలుగు యువత కమిటీ, కార్యాచరణ పై సమీక్షిస్తున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు

29-09-2021 

ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది..

27-09-2021

(1) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ నల్లచట్టాలను రద్దు చేయాలని అఖిల పక్షంతో కలసి ఈ రోజు మదనపల్లిలో భారత్ బంద్ లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు , అఖిల పక్ష సంఘాల నాయకులు…

(2) TNSF రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన మార్పూరి రమేష్ కు శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు

25-09-2021 ఈ నెల 27వ తేదీన జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి అని మన టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీ రామ్ చిన్నబాబు గారు :
అఖిల పక్షాల నాయకుల తో కలిసి భారత్ బంద్ ను విజయయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.

TDP State Youth President#supporting #Bharath Bandh#

25-09-2021  వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్, అసాంఘిక కార్యాకలపాలకు నిలయంగా మారింది
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు మదనపల్లిలో విలేకరుల సమావేశంలో శ్రీరామ్ గారు మాట్లాడుతూ…
◆ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో డ్రగ్ మాఫియా చెలరేగిపోతుంది
◆ బియ్యం ఎగుమతి చేస్తామంటూ విజయవాడలో సీఎం ఇంటి సమీపంలో ఆఫీ ట్రేడర్స్ పేరుతో రిజిస్టర్ చేసుకున్న ఓ కంపెనీ పేరుతో యదేచ్చగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోంది.
◆ ఈ కంపెనీ పేరుతో అఫ్ఘనిస్తాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి టాల్కమ్ పౌడర్ పేరుతో తరలిస్తున్న రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడింది.

◆ ఇప్పటికే ఈ కంపెనీ ద్వారా రూ. 72 వేల కోట్ల విలువైన 24 టన్నుల హెరాయిన్ ఆఫ్గనిస్తాన్ నుంచి దేశంలోకి దిగుమతి అయినట్టు అధికారులు చెబుతున్నారు.
◆ ఈ డ్రగ్స్ మాఫియాతో వైసీపీకి సంబందం లేకపోతే సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు
◆ ఒకప్పుడు దేశంలో ఎక్కడో ఖరీదైన హోటళ్లు, పబ్బుల్లోనో డ్రగ్స్ వినియోగించేవారు, కానీ వైసీపీ పాలనలో బడ్డీ కొట్లు, కిల్లీ కొట్టు, టీ షాపుల్లో సైతం డ్రగ్స్ లభిస్తున్నాయి.

◆ రాష్ట్రంలో యూనివర్సిటీలు, కాలేజీలు, చివరకు పాఠశాలల వద్ద కూడా గంజాయి అమ్మకాలు జరగటం ఆందోళన కల్గిస్తోంది.
◆ ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాతో వేల కోట్లు సంపాదించని వైసీపీ నేతలు అవి చాలవన్నట్టు డగ్స్ మాఫియాకు సైతం పెంచి పోషిస్తున్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు , తెలుగు రైతు రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు , మైనార్టీ నాయకులు SA మస్తాన్ , మహబూబ్ ఖాన్ , రాజంపేట పార్లమెంటు తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి విజయమ్మ , వినోద్ , మురళి తదితరులు పాల్గొన్నారు. 

25-09-2021 ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మదనపల్లి నుండి వైజాగ్ వరకు బస్సు యాత్ర ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు. 

25-09-2021 పెంచుపాడు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు నాగప్ప గారి భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, దొరస్వామి నాయుడు , పెంచుపాడు స్వామి తదితరులు.  

25-09-2021

సివిల్స్ లో 48వ ర్యాంకు సాధించిన మదనపల్లికి చెందిన సాయి మానస ను ఈ రోజు వాళ్ల ఇంట్లో కలిసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు , దొరస్వామి నాయుడు మరియు తదితరులు..

 

24-09-2021 కడపలో మాధవి కన్వెన్షన్ హల్ లో రాయలసీమ ప్రాజెక్టుల భవిష్యత్తుపై సమాలోచన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు

16-09-2021 ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిన అఖిలపక్ష విద్యార్థి సంఘాలు , తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు , తదితరులు.  

16-09-2021 

ఒక్క రూపాయికి వైద్యం చేసిన మహానుభావుడు పల్నాటి పులి డా. కోడెల శివప్రసాదరావు గారి 2 వర్ధంతి సందర్భంగా ఈ రోజు మంగళగిరి లో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో కోడెల గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు , గంజి చిరంజీవి గారు.

13-09-2021 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన   తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.

13-09-2021 

నిమ్మలపల్లి మండలం రాచవేటివారి పల్లి పంచాయతీ గొల్లపల్లికి చెందిన రైతులు మీద అక్రమ కేసులు పెట్టించిన అవినీతి ఫారెస్ట్ గార్డ్ ప్రకాశ్ మీద చర్యలు తీసుకోవాలని సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగుదేశం, సిపిఐ పార్టీ ల ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపి అనంతరం వినతిపత్రం అందచేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.     ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి రాటకొండ మధుబాబు, ఆర్జే వెంకటేష్ , గొల్లపల్లి రైతులు పాల్గొన్నారు.

29-08-2021 గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు

26-08-2021 – రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు..

25-08-2021 – హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ మనవరాలు కీర్తి రిసెప్షన్ కి హాజరై వధూవరులను ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, తదితరులు

25-08-2021 –  హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారితో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు..

25-08-2021 – మదనపల్లి మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ గారి కుమారుడు యశస్వి రాజ్ నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.

23-08-2021 – తొగట వీర క్షత్రియ సంఘం కొత్త అధ్యక్షునిగా ఉప్పు రామచంద్ర గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది…
నూతనంగా ఎన్నికైన రామచంద్ర గారిని శ్రీరామ్ చినబాబు గారు సన్మానించారు..

ఈ కార్యక్రమంలో మోడెం వెంకటరమణ గారు, సిద్ధప్ప గారు లక్ష్మీనారాయణ గారు , ఎస్ వి రమణ గారు , ఎం వి రమణ గారు ఆర్ శివయ్య గారు , శీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు..

23-08-2021 – మదనపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపం లో వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న శ్రీరామ్ చినబాబు గారు..

22-08-2021 – మదనపల్లి PJR కళ్యాణ మండపంలో నీకా కార్యక్రమానికి హాజరై సికిందర్ ను ఆశీర్వదించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు..

22-08-2021 – రామాపురం లో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు , రాం ప్రసాద్ రెడ్డి గారు మరియు దొరస్వామి నాయుడు గారు..

20-08-2021 – Todays paper clippings of Telugu Yuvatha President Gundlapalli Sreeram Chinnababu garu strike about job calender.

19-08-2021 – ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ,తెలుగు యువత, విద్యార్థి యువజన సంఘాల ఆద్వర్యంలో విశాఖపట్నంలో ధర్నా చౌక్ వద్ద ఒక రోజు దీక్ష చేపట్టటం జరిగింది. నిరుద్యోగులు చేపట్టిన ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి, కొత్త జాబు క్యాలెండర్ విడుదల చేసే వరకు పోరాడానికి తెలుగు యువత తరుపున పూర్తి మద్దతు ఉంటుంది అని తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు..

19-08-2021 –  Todays paper clippings of Gundlapalli Sreeram Chinnababu Telugu Youth President.

18-08-2021 – ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులను మోసం చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేసిన జాబులు లేని జాబ్ క్యాలెండర్ కు నిరసనగా తెలుగు యువత, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి , TNSF మరియు ఇతర విద్యార్థి యువజన సంఘాల ఆద్వర్యంలో విశాఖపట్నంలో CM జగన్ మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.. ఈ కార్యాక్రమంలో TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు , AISF రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు , PDSU రాష్ట్ర అధ్యక్షులు రవి చంద్ర గారు మరియ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

18-08-2021 – వైజాగ్ ఎయిర్ పోర్టులో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారికి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత నాయకులు.

17-08-2021 – Todays paper clippings of Sreeram Chinnababu AP State Telugu Yuvatha President

15-08-2021 – Todays paper clippings of sreeram chinnababu Telugu Yuvatha President.

15-08-2021 – 75 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా..
మదనపల్లిలో జాతీయ జెండా ఎగురవేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు , టీడీపీ నాయకులు జంగాల రమణ , మహబూబ్ ఖాన్ , బాబ్జాన్, తెలుగు యువత నాయకులు అరుణ్ , అఖిల్ , ప్రణయ్ , సిద్దు , సుదర్శన్ రెడ్డి , శ్రీనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

14-08-2021 –  కడప పర్యటనకు విచ్చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు కి ఘన స్వాగతం పలికిన తెలుగు యువత నాయకులు , టీడీపీ కార్యకర్తలు.అనంతరం శ్రీ హరిప్రియ హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మీడియా వారితో మాట్లాడారు.

13-08-2021 – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులుగా నియమించబడిన డూండి రాకేష్ గారికి శుభాకాంక్షలు తెలియచేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.. ఈ రోజు వారు రాష్ట్ర పార్టీ ఆఫీస్ లో వారికి కేటాయించిన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో SC సెల్ రాష్ట్ర అధ్యక్షులు MS రాజు గారు, TNTUC రాష్ట్ర అధ్యక్షులు రఘురామ రాజుగారు, మరియు అంగన్వాడి రాష్ట్ర అధ్యక్షులు సునీత గారితో కలిసి వారిని అభినందించటం జరిగింది. 

12-08-2021 – ఈ రోజు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు..

11-08-2021 – అప్పులు తీర్చే మార్గం లేక 2 రోజుల క్రితం జాతీయ చేనేత దినోత్సవం నాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మదనపల్లికి చెందిన బి.నారాయణ గారి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు…
నారాయణ గారి కుటుంబసభ్యులకు 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని శ్రీరామ్ చినబాబు గారు డిమాండ్ చేశారు

10-08-2021 – Todays paper clippings of Telugu Yuvatha President Gundlapalli Sreeram Chinnababu

09-08-2021 – Todays Paper clippings of Telugu Yuvatha State President Gundlapalli Sreeram Chinnababu.

08-08-2021 – తొగట వీర క్షత్రియ ఆధ్వర్యంలో ఈ రోజు చౌడేశ్వరి అమ్మ వారి జయంతి కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

07-08-2021 – ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి స్థానిక రత్నాల చెరువు భావనారుషి స్వామివారి గుడి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.. అనంతరం చేనేత కార్మికులను సన్మానించి, పేద చేనేత కార్మికులకు ఆర్ధిక సహాయం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గంజి చిరంజీవి గారు, తెలుగు యువత మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

07-08-2021 – Todays paper clippings of Gundlapalli Sreeram Chinnababu Telugu Yuvatha President.

05-08-2021 – తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారిని గన్నవరం స్టేషన్ కు తరలించారు…

05-08-2021 – తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారిని మరియు తెలుగు యువత నాయకులను గన్నవరం లో అరెస్టు చేసిన పోలీసులు. దేవినేని ఉమా గారికి స్వాగతం పలుకుతున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు..

05-08-2021 – ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ,తెలుగు యువత, విద్యార్థి యువజన సంఘాల ఆద్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఒక రోజు దీక్ష చేపట్టటం జరిగింది. నిరుద్యోగులు చేపట్టిన ఈ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి, కొత్త జాబు క్యాలెండర్ విడుదల చేసే వరకు పోరాడానికి తెలుగు యువత తరుపున పూర్తి మద్దతు ఉంటుంది అని తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు..

02-08-2021 – ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని ఈ రోజు మదనపల్లిలో MPDO గారిని కలిసి వినతిపత్రం అందచేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు..

ఈ సందర్భంగా శ్రీరామ్ గారు మాట్లాడుతూ…..
◆ ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

◆ తెలుగుదేశం పార్టీ హయాంలో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 5 సంవత్సరాలలో సుమారు 24 వేల కిలోమీటర్లు రోడ్లు వేసిన ఘనత మా టీడీపీ ప్రభుత్వానిది..

◆ పంచాయతీలలో 27 లక్షల ఎల్.ఈ.డి దీపాలు ఏర్పాటు చేయడం చేసి దేశంలోనే ప్రధమస్థానం.

◆ 4950 గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం జరిగింది.

◆ 6500 స్మశాన వాటికలు అభివృద్ధి చేయడం జరిగింది.

◆ మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయ్యిన మీరు మూడు రంగులు వేసుకుని మేము చేసిన అభివృద్ధి మీది అని చెప్పుకుంటున్నారు..
◆ సొంత నిధులను ఖర్చుచేసి చిన్న చిన్న కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గ్రామాలు అభివృద్ధి కోసం పనులు చేసిన వారి మీద సైతం కక్ష సాధింపు చర్యలు చెప్పట్టారు. బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. సకాలంలో బిల్లులు రాక అప్పులు, వడ్డీలు కట్టలేక అమ్ముకోన్నారు. మరికోందరు ఆత్మహత్య చేసుకోన్నారు…

◆ పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్ర ఇప్పటికే నిధులు విడుదల చేసింది. కానీ వై.సి.పి ప్రభుత్వం వాటిని మళ్లించి రాష్ట్ర వాటా చెల్లించా కుండా పెండింగులో పెట్టింది.
◆ నరేగా బిల్లులు చెల్లింపునకు సంభందించి చంద్రబాబు నాయుడు పోరాటం చేశారు.

◆ ప్రభుత్వం బిల్లులు చెల్లింపులు జరపకపోవడంతో న్యాయంకోసం చాలా మంది న్యాయ స్థానాలు ఆశ్రయించారు.

◆ నిబంధనలను అనుసరించి పెండింగ్ బిల్లులు చెల్లించాలి అని కోర్టులు పదే పదే చెప్పినా ఏదో ఒక సాకుతో కాలయాపన చేస్తూ రెండు సంవత్సరాలుగా బిల్లులు పెండింగులో పెట్టారు.

◆ నిధులు లేవు అని, కేంద్రం ఇవ్వలేదు అని మరోసారి విజిలెన్స్ ఎంక్వెరిఅని కోర్టుకు సైతం అబద్ధాలు చెబుతూ కోర్టు ముందు సైతం తప్పుడు సమాచారం ఉంచడం వై.సీపీ దుర్మార్గపు ఆలోచనలకు పరాకాష్ట.
◆ మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము.. కోర్టు ఆదేశాలను అనుసరించి 2500 కోట్ల పెండింగ్ నరేగా బిల్లులను వెంటనే చెల్లింపులు జరపాలి

◆ జాతీయ ఉపాధి హామీ చట్టం 2005 ప్రకారం 12 శాతం వడ్డీతో సహా చెల్లింపులు జరపాలి.

◆ అధికారులు రాజకీయ ఒత్తిడి లోబడి కాకుండ నిబంధనలు లోబడి పనిచేయాలి..

30-07-2021 – నిమ్మలపల్లి మండలం మూస్తూరు పంచాయతీ వలసపల్లి గ్రామం లో గంగమ్మ తల్లి గుడి ప్రారంభోత్సవంలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు , దొరస్వామి నాయుడు గారు , జంగాల రమణ గారు , శ్రీపతి గారు , రామకృష్ణ గారు మరియు రమణ గారు తదితరులు పాల్గొన్నారు..

30-07-2021 – జగన్ మోహన్ రెడ్డి విద్యా దీవెన ను విద్యార్థుల దగాగా మార్చాడు…వైసీపీ ప్రభుత్వం చేసేది గోరంత . ప్రచారం చేసుకునేది కొండంత…
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు

ఈ సందర్భంగా విలేకరులతో శ్రీరామ్ గారు మాట్లాడుతూ…

◆ చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వగా జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని 10.97 లక్షల మంది విద్యార్థులకు కుదించారు. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను దూరం చేసి విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశాడు.

◆ 5 లక్షల విద్యార్థుల భవిష్యత్ ను కోత కోసిన ఈ పథకానికి సుమారు రూ.5 కోట్ల ప్రకటనలతో ప్రజా ధనం వృధా చేస్తున్నారు. పైపెచ్చు అందులో చెప్పినవన్ని అబద్దపు ప్రచారాలే. ప్రచార మాయ మాత్రమే.

◆ నాణ్యమైన విద్యలో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3వ స్థానంలో ఉన్న రాష్ట్రం జగన్ రెడ్డి హయాంలో 19వ స్థానానికి దిగజారింది.

◆ పేద విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకం రద్దు చేయటం వల్లన ఒక్కొక్క విద్యార్ధి 10 లక్షలు కోల్పోయారు
◆ నిరుద్యోగ భృతి రద్దు చేయటం వల్లన సుమారు 6 లక్షల మంది కోల్పోయారు
◆ బాలికలకు ఇచ్చే సైకిళ్ల పంపిణీ రద్దు చేశారు..
◆ కోవిడ్ సమయంలో 600 మంది ఉపాధ్యాయులు చనిపోతే పట్టించుకోని ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్ట పరుస్తుంది.

◆ అదే విధంగా కరోనాలో దాదాపు 5 లక్షల మంది ప్రైవేట్ టీచర్లకు జీతాలు లేక దుర్బర జీవితం అనుభవిస్తుంటే జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు.

◆ తెలుగుదేశం హయాంలో రెండు డీఎస్సీలు నిర్వహించి 16,828 మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలిచ్చాం. అదే జగన్ రెడ్డి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీనిచ్చి రెండేళ్లైనా ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. జాబ్ క్యాంలెడర్ లో ఒక్క డీఎస్సీ పోస్ట్ ను కూడా చూపించలేదు.

ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు TNTUC రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు శివయ్య, టిడిపి నాయకులు రమణ, TNSF రాజంపేట జనరల్ సెక్రటరీ సాయి చంద్ ,తెలుగు యువత నాయకులు అరుణ్ తేజ , సిద్దు తదితరులు పాల్గొన్నారు.

29-07-2021 – Todays Paper clippings of TDP Telugu Yuvatha President Sreeram Chinnababu

28-07-2021 –

మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం : తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు

మొన్న తెలుగు యువత నేతలపై అక్రమ కేసులు…ఇప్పుడు మాజీ మంత్రిపై అక్రమ కేసులు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా….పోలీసుల రాజ్యం నడుస్తుందా. కారులో నుండి కిందకు దిగని దేవినేని ఉమ ఎవరిపై హత్యాయత్నం చేశారో పోలీసులు సమాధానం చెప్పాలి.. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు , TNTUC రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శివయ్య , టీడీపీ నాయకులు పెంచుపాడు స్వామి తెలుగు యువత నాయకులు అరుణ్ తేజ్ , సిద్దు తదితరులు పాల్గొన్నారు..