EML India

ఢిల్లీ విమానాశ్ర‌యం తీరుపై జ‌క్క‌న్న సీరియ‌స్.. !

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on telegram
Telegram
Share on email
Email
S S Rajamouli

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ యాజమాన్యానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు..

దర్శకధీరుడు రాజమౌళి తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో తనకు క‌లిగిన‌ ఒక చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన ట్వీట్ లో…. అర్ధరాత్రి ఒంటిగంట కు తాను లుఫ్తానాసా విమానం దిగినట్టు తెలిపారు. అయితే ఆర్టీపిసిఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తు ఫామ్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్యాసింజర్లు అందరూ దరఖాస్తులను తీసుకుని కొంద‌రు గోడ‌కు ఆనిస్తూ…. మరికొందరు నేల మీద కూర్చుని నింపుతున్నార‌ని తెలిపారు. తనకు ఈ పద్ధతి అస్సలు నచ్చలేదని పేర్కొన్నారు. దరఖాస్తులను నింపడానికి టేబుల్స్ ఏర్పాటు చేస్తే బాగుండేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే విమానాశ్రయం నుండి బయటకు వచ్చాక ఎన్నో వీధి కుక్కలు కనిపించాయని పేర్కొన్నారు. మొదటిసారి భారత్ కు వచ్చే విదేశీయులకు మనదేశం పై మంచి అభిప్రాయం కలగదని తెలిపారు. ఈ విషయాన్ని అధికారులు దయచేసి పరిశీలించాలని కోరారు. ఇక జ‌క్క‌న్న చేసిన ట్వీట్ కు పలువురు నెటిజన్లు కూడా మద్దతు ఇస్తున్నారు. మంచిగా గ‌డ్డి పెట్టార‌ని కొందరు అంటుండగా మరికొందరు తాము కూడా ఢిల్లీ విమానాశ్రయంలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నామని చెబుతున్నారు.

Share on facebook
Share on twitter
Share on linkedin
Share on google
Share on whatsapp
Share on email
Share on pinterest
Share on reddit
Share on telegram
Share on tumblr