EML India

మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూత

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on telegram
Telegram
Share on email
Email
Sabbam-Hari Ex-MP

కరోనా మహమ్మారి బారినపడి మరో రాజకీయ ప్రముఖుడు తిరిగిరాని లోకాలకు (Sabbam Hari Dies) తరలి వెళ్లారు.మాజీ ఎంపీ సబ్బం హరి విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 15 రోజులుగా కరోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస (Sabbam Hari Death) విడిచారు. గత నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు.

అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరిని కరోనా వైరస్ మహమ్మారి బలిదీసుకుంది.

మూడో రోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. అనంతరం వైద్యుల సలహామేరకు ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు.

సబ్బం 1955 విశాఖ మేయర్ ఎన్నికల్లో పోటి చేశారు. మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అవినీతి ఆరోపణలు లేకుండా మేయర్‌గా పరిపాలన కొనసాగించారు. పారిశుద్ధ్యాన్ని ప్రైవేటీకరణ చేసిన తొలి నగరంగా విశాఖను సబ్బం హరి మలిచారు. విశాఖ కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా.. అనంతరం నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా సబ్బం నియామకమయ్యారు.

1970 అక్టోబర్ 15న లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకున్నారు. సబ్బంకు అవని, అర్చన అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కుమారుడు వెంకట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. 15వ లోక్‌సభకు అనకాపల్లి ఎంపీగా కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి మృతికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఈ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. సబ్బం హరి మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

 
Share on facebook
Share on twitter
Share on linkedin
Share on google
Share on whatsapp
Share on email
Share on pinterest
Share on reddit
Share on telegram
Share on tumblr